సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ పై దాడి దేశ చ‌రిత్ర‌లో చీక‌టి రోజు – తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబ‌ర్ 6, అద్దం న్యూస్ :   సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ పై దాడి దేశ చ‌రిత్ర‌లో చీక‌టి రోజు అని తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌జాస్వావ్య దేశంలో స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి ఉండి ప‌ని చేసే న్యాయ‌వ్య‌వ‌స్థ‌, న్యాయ‌మూర్తుల‌పై విచ‌క్ష‌ణ కోల్పోయి ఆట‌వికులుగా దాడికి య‌త్నించ‌డాన్ని యావ‌త్ దేశ‌పౌరులంద‌రూ ఖండిస్తున్నార‌న్నారు. దాడికి చేసిన వారిపై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.