హైదరాబాద్, సెప్టెంబర్ 30, ( అద్దం న్యూస్ ) : బీజేపీ ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ మహాకాళి జిల్లా ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడకు చెందన బీజేపీ సీనియర్ నాయకుడు ముదుగుల సురేష్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ నియామక పత్రం అందజేశారు. సురేష్ ముదిరాజ్ 1988లో బిజెపి కవాడిగూడ డివిజన్ కోశాధికారిగా, 1990 లో బిజెపి కవాడిగూడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా, 1994 లో బిజెవైఎం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యుడిగా, 1997 లో కవాడిగూడ డివిజన్ బిజెవైఎం వైస్ ప్రెసిడెంట్ గా, 2004 లో బిజెపి నగర కార్యనిర్వాహక సభ్యుడిగా, 2007 లో బిజెపి సిటీ ( ప్రోటోకాల్ సెల్ ) జాయింట్ కన్వీనర్ గా, 2010 లో బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా 2013లో బిజెపి గీటర్ హైదరాబాద్ కార్యనిర్వాహక సభ్యుడిగా, 2019 లో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యుడిగా, 2023 లో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యుడిగా పదవుల్లో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం తాజాగా బిజెపి ఓబిసి మోర్చా సికింద్రాబాద్ – మహంకాళి జిల్లా, ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో తనను సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కు, బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భారత్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో తన వంతు కృషిచేసి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని అన్నారు.