బిజెపి ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సురేష్ ముదిరాజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 30, ( అద్దం న్యూస్ ) : బీజేపీ ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ మహాకాళి జిల్లా ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడకు చెందన బీజేపీ సీనియర్ నాయకుడు ముదుగుల సురేష్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ నియామక పత్రం అందజేశారు. సురేష్ ముదిరాజ్ 1988లో బిజెపి కవాడిగూడ డివిజన్ కోశాధికారిగా, 1990 లో బిజెపి కవాడిగూడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా, 1994 లో బిజెవైఎం ముషీరాబాద్...