Suriya: అభిమాని పెళ్లికి అతిథిగా సూర్య.. వధువు రియాక్షన్ వైరల్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ తన నిరాడంబరత్వంతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. తాజాగా అరవింద్ అనే అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఊహించని పరిణామంతో వధువు కాజల్ ఆశ్చర్యపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువు కాజల్‌కు సూర్య (Suriya) అంటే ఎనలేని అభిమానం. ఆమెకు తెలియకుండానే, వరుడు అరవింద్ హీరో సూర్యను తమ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లి జరుగుతుండగా, తెలుపు రంగు వస్త్రాల్లో, కూలింగ్ గ్లాసెస్...