Addam News
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:00 am Posted by : Addam News

తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్ర‌హీత‌ కొండా స‌హ‌దేవ్‌కు “ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ క‌ళా ర‌త్న “ పుర‌స్కారం ప్ర‌దానం

తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్ర‌హీత‌ కొండా స‌హ‌దేవ్‌కు “ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ క‌ళా ర‌త్న “ పుర‌స్కారం ప్ర‌దానం

హ‌నుమ‌కొండ‌, సెప్టెంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :   నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్ర‌హీత‌ కొండా స‌హ‌దేవ్‌కు ప్రతిష్టాత్మక “కొండా లక్ష్మణ్ బాపూజీ కళా రత్న పురస్కారం–2026ష దక్కింది. హ‌నుమకొండ భీమారం ఎస్‌విఎస్ క్యాంప‌స్‌లో నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవం కార్య‌క్ర‌మం జ‌రిగింది. పులికంటి రాజేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మానికి కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటి ( కుడా ) చైర్‌ప‌ర్స‌న్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వెన్నెల శ్రీరాములు, ఆల్ ఇండియా ప‌ద్మ‌శాలి సంఘం అధ్య‌క్షుడు కంద‌గ‌ట్ల స్వామి లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కొండా స‌హ‌దేవ్‌కు “కొండా లక్ష్మణ్ బాపూజీ కళా రత్న పురస్కారం–2026 ను అంద‌చేశారు. అంత‌ర్జాతీయంగా తైక్వాండోలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేసిన కొండా స‌హ‌దేవ్ సేవ‌ల‌ను గుర్తించి ఈ పుర‌స్కారాన్ని అంద‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png