Addam News
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 5:06 pm Posted by : Addam News

అక్రమ నిర్మాణం పై చ‌ర్య‌లు తీసుకోండి

అక్రమ నిర్మాణం పై చ‌ర్య‌లు తీసుకోండి
– జిహెచ్ఎంసి అధికారుల‌కు ఫిర్యాదు

హైదరాబాద్,  జూన్ 4, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తున్నారని, ఆ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాలని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ స్థానికంగా ఉండే ప్రవీణ్ కుమార్ జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌కు, ముషీరాబాద్ సర్కిల్–41 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌కు, టౌన్ ప్లానింగ్ ఏసిపి కి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… అడిక్‌మెట్ డివిజ‌న్ విద్యాన‌గ‌ర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా జిహెచ్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తున్నారని అన్నారు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మించడం వల్ల మా ఇంటి తో పాటు చుట్టుపక్కల ఇండ్ల వారికి కూడా ఇబ్బందికరంగా ఉందన్నారు. నిబంధన విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ ఇంటి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి త్వరలోనే అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని సందర్శించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png