అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోండి
అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోండి – జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు హైదరాబాద్, జూన్ 4, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తున్నారని, ఆ నిర్మాణ పనులను నిలిపివేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికంగా ఉండే ప్రవీణ్ కుమార్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌కు, ముషీరాబాద్ సర్కిల్–41 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌కు, టౌన్ ప్లానింగ్ ఏసిపి కి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ......