రాష్ట్ర సదస్సుకు తార్నాక ఉద్యమకారులు
తార్నాక, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల సమస్యలు, వారి సంక్షేమం, గుర్తింపు, గౌరవం వంటి అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు తార్నాక ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు హాజరయ్యేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును తార్నాక చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత...