ప్రజా సంక్షేమానికి టాస్క్ కృషి – పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
తార్నాక, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : తార్నాక ప్రాంత ప్రజల సంక్షేమం, పౌర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తార్నాక అసోసియేషన్ ఫర్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ( టాస్క్ ) 1996 నుంచి సేవలందిస్తోందని సంస్థ అధ్యక్షురాలు సి.మంజుల రాజు సాగర్ తెలిపారు. రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ట్రాఫిక్, పార్కింగ్ తదితర సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తూ నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య చర్యలు, మట్టి...