టాటా సియెర్రా మళ్లీ వస్తోంది.. ఈసారి కొత్త హంగులతో!

భారత ఆటోమొబైల్ చరిత్రలో కొన్ని కార్లు మాత్రమే తమదైన ముద్ర వేసి, ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హిందుస్థాన్ అంబాసిడర్, మారుతి 800, జిప్సీ వంటి కార్లతో పాటు టాటా సియెర్రా కూడా ఈ జాబితాలో ఉంటుంది. ఇప్పుడు, ఆ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ, ఐకానిక్ సియెర్రా ఎస్‌యూవీని సరికొత్త హంగులతో తిరిగి తీసుకురావడానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. ఈ నెల 25న ఈ ఆధునిక సియెర్రా భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో అందరినీ ఆకట్టుకున్న సియెర్రా, ఇప్పుడు...