జూబ్లీహిల్స్ పెద్దమ్మ బోనాల జాత‌ర‌లో పాల్గొన్న టిడిపి నాయ‌కుడు సాయిబాబా

జూబ్లీహిల్స్ పెద్దమ్మ బోనాల జాత‌ర‌లో పాల్గొన్న  టిడిపి నాయ‌కుడు సాయిబాబా హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ :   తెలంగాణ బోనాల జాతర సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి అమ్మవారి దేవాలయాన్ని మాజీ వికలాంగుల సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పి.సాయి బాబా, రాష్ట్ర తెలుగు మహిళా ప్రమీళ‌, టిఎన్‌టియుసి నాయకులు ఏబిఆర్. మోహన్ రావు, వెంకటేష్ తదితరులు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.