Addam News
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 1:42 am Posted by : Addam News

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌న్మాంచిన టిడిపి నాయ‌కులు

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌న్మాంచిన టిడిపి నాయ‌కులు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన యువకుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చిన్ననాటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, పర్వతారోహణం చేసిన‌ ఎ.మనీష్ యాదవ్‌ను టిడిపి నాయ‌కులు స‌న్మానించారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో మ‌నీష్ యాద‌వ్‌కు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా మాట్లాడుతూ… తన తల్లిదండ్రులు మధ్య తరగతికి చెందినప్పటికీ పర్వతారోహణ పట్ల అతనికి ఉన్న అభిరుచిని ప్రోత్సహించారన్నారు. ఇటీవల కాలంలో టాంజానియాలోని దాదాపు 5984 అడుగుల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి తెలుగు వాడిగా ఘనత సాధించారని అభినందించారు. ఒక తెలుగు వాడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సాహసం పేతమైనా పర్వతారోహణలు మరిన్ని చేపట్టాలని కోరారు. అదే విధంగా టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మరింత ప్రోత్సహించే విధంగా పాటుపడమన్నారు. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేసారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందుకుని మనీష్ యాదవ్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, ప్రదీప్ గౌడ్, కిరణ్, శ్రీనివాస్ నాయుడు, సుక్రవేది, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png