Addam News
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 11:13 am Posted by : Addam News

క‌న‌కాల క‌ట్ట మైసమ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన్న టిడిపి నేత‌లు

క‌న‌కాల క‌ట్ట మైసమ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన్న టిడిపి నేత‌లు


హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ :    తెలంగాణ ఆషాడ మాస బోనాల జాతర సందర్భంగా హైద‌రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి దేవాలయంలో జ‌రిగిన బోనాలు, రంగం కార్య‌క్ర‌మంలో మాజీ వికలాంగుల సంస్థ ఛైర్మ‌న్‌, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పి.సాయిబాబా, పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం టిడిపి నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ది పథంలో దూసుకెళ్లాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, అమ్మవారిని వేడుకుని దేవాలయంలో పునగ శీల గోత్రంతో అర్ఛన, అభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజుగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ కుమార్, భాను ప్రకాష్, బి.రాజు, సుక్రవేది, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png