హైదరాబాద్, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపం వద్ద ప్రాంగణంలో అర్చకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి ఆశిస్సులు అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానన్నారు. సమాజంలో ఆటంకాలన్నీ తొలగిపోయి, ప్రజలందరికీ మంచి జరగాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్, రాష్ట్ర బిసి మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సి మాజీ అధ్యక్షుడు పి.అశోక్, ఎమ్.శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, పి.వంశీకృష్ణ, జ్ఞానేశ్వర్ యాదవ్, సత్తన్న, రవి లతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.