ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న టిడిపి నేత‌లు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :    తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపం వద్ద ప్రాంగణంలో అర్చకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి ఆశిస్సులు అందజేశారు.  అనంతరం తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... విఘ్నేశ్వరుని దివ్య...