Addam News
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 3:02 am Posted by : Addam News

టిడిపి జాతీయ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు ఎం.అర‌వింద్ కుమార్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు శ‌నివారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని ఆ పార్టీ న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులందరూ అరవింద్ కుమార్ గౌడ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అరవింద్ కుమార్ గౌడ్ అందిస్తున్న సేవలు అభినందనీయమ‌న్నారు. పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, అధినేత ఆశయ సాధనకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, టిడిపి నాయ‌కులు భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, భవాని శ్రీనివాస్, మచ్చేంధర్, మహేంధర్, సత్తన్న, రవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png