Addam News
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 1:16 pm Posted by : Addam News

  టిడిపి ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళి

హైదరాబాద్,  అద్దం న్యూస్  :     బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్ట‌ర్‌.బిఆర్.అంబేద్క‌ర్‌ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అంభేధ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్  ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, అస్పృశ్యత నివారణకు అంబేద్క‌ర్‌ కంకణం కట్టుకొని కృషి చేసారు. అణగారిన వర్గాలకు, హరిజన.. గిరిజన, బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించిన మహోన్నత వ్యక్తి అని, ఈ రోజు ఎంతోమంది ఆయన ఆదర్శాలు వల్లిస్తున్నారే తప్పా ఆచరణలో చేసింది శూన్యమ‌న్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యావంతులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి, ఆనాడు స్వర్గీయ ఎన్టీరామారావు రాజకీయాల్లో అణగారిన వర్గాల యువతకు పెద్దపీట వేశారని తెలిపారు. ఆ రోజుల్లో డా.కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతిగా నియామకం జరిగినప్పుడు జాతీయ స్థాయిలో అతి కీలకమైన పాత్రను పోషించింద తెలుగు దేశం పార్టీనేనని అన్నారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్‌స‌భ‌ స్పీకర్ పదవికి దళితుడైన జిఎంసి బాలయోగిని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా దళిత మహిళ  ప్రతిభా భారతి  ఎంపిక చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు.
 ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్ విగ్ర‌హానికి  నివాళి  : 
హైద‌రాబాద్‌ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్క‌ర్‌  విగ్రహానికి  అరవింద్ కుమార్ గౌడ్ నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, పరుశురామ్, ఎస్.ప్రకాష్, పి.అశోక్, రాజు నాయక్, ఎం.రాజు, కిరణ్, గండికోట విజయ్, తడక వినోద్, సిహెచ్.ప్రదీప్ గౌడ్, కాతా విజయ్ కుమార్, చంద్రమోహన్ గౌడ్,  బి.రాజు, సి.విఠ్టల్, వీరబాబు, లయీఖుద్దీన్,  సురేష్, సుక్రవేది, మహేంధర్, యాదగిరి, కృష్ణస్వామి భవాని శ్రీనివాస్, మహిళా నాయకురాళ్లు  తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png