టిడిపి ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళి
హైదరాబాద్, అద్దం న్యూస్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అంభేధ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, అస్పృశ్యత నివారణకు అంబేద్కర్ కంకణం కట్టుకొని...