చిక్కడపల్లిలో ఘనంగా టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో పేదలకు పులిహోర ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. టిడిపి రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు డి.చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా, ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్‌లు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు ఎన్‌టిఆర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...