Addam News
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 11:49 pm Posted by : Addam News

నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, అద్దం న్యూస్ : నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర టిడిపి కార్యాయ‌లంలో జ‌రిగిన స‌మావేశంలో పార్టీ ప్రచార సామాగ్రి తోరణాలు, జెండాలు, కండువాలు నియోజకవర్గాల వారీగా పంపిణి చేసారు. సాయిబాబ అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా దోమ‌ల‌గూడ‌లోని జిల్లా కార్యాల‌యంలో పార్టీ ప‌తాకావిష్క‌ర‌ణ, ఎన్‌టిఆర్ చిత్ర ప‌టానికి నివాళి కార్య‌క్ర‌మంతో పాటు కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మనికి ముఖ్య అతిథిగా పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్ హాజ‌రై పారిశుద్ధ్య కార్మికుల‌కు దుస్తుల‌ను అంద‌చేస్తార‌న్నారు. అలాగే అన్ని నియోజ‌కవ‌ర్గాల్లో టిడిపి ప‌తాకావిష్క‌ర‌ణ‌లు, ఎన్‌టిఆర్ చిత్ర ప‌టాల‌కు నివాళి కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. అలాగే అన్న‌దానం, పండ్ల పంపిణీ, స్వీట్ల పంపిణీ త‌దిత‌ర సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, గండికోట విజయ్, తడక వినోద్, కిరణ్ కుమార్, భానుప్రకాష్, జగదీష్ గౌడ్, విక్రమ్, రామారావు, ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png