Addam News
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 5:35 am Posted by : Addam News

ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై టిడిపి అలుపెరగని పోరాటం

ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై టిడిపి అలుపెరగని పోరాటం
– మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన

సికింద్రాబాద్‌, జూలై 12, ( అద్దం న్యూస్ ) : ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంద‌ని ఆ పార్టీ మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణా క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న “ తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భౌధ్దనగర్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ నిర్వహించిన కార్యక్రమము పార్సీగుట్ట చౌరస్తా వద్ద నుండి ప్రారంభమైంది. సికింద్రాబాద్ అసెంబ్లీలోని ఇందిరానగర్ పలు బస్తీలలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ “ తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమానికి మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, మాజీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పి.అశోక్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవిజి నాయుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ కో– ఆర్డినేటర్ నల్లెల కిషోర్, పి.బాలరాజు గౌడ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా స్థానిక ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్నా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా సికింద్రాబాద్ తెదేపా ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ తెదేపా జండాను పార్సీగుట్టలో ఆవిష్కరించారు. అనంతరం పార్సీగుట్ట చౌరస్తా నుండి పెద్ద ఎత్తున హాజరైన తెదేపా నాయకులు నాయకురాళ్లతో కలిసి న్యూ అశోక్‌న‌గ‌ర్ బస్తీలో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కొరకు ప్రజల ప్రగతి కోసం ప‌ని చేస్తుంద‌న్నారు. ఈనాటి పాదయాత్రలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీసులమోతపై, రోడ్లు తవ్వి వారాలు గడుస్తున్నా కొత్త రోడ్లు వేయకపోవడంపై ఫిర్యాదులు అందాయని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు కూన శ్రవణ్, తడక వినోద్, కాత విజయ్, జగదీష్, కొమరయ్య, వెంకటస్వామి, జిఎం.రమేష్, సాంబ, పిట్ల శంకర్ ముదిరాజ్, పొట్టి శ్రీను, చంద్రమోహన్, శ్రీను యాదవ్, కట్ట రాములు, బోసు, చిరంజీవి రాజు, శ‌శిరేఖ‌, సరస్వతి, చందర్ ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, ప్రవీణ్, పుప్పాల విజయ్, భానుప్రకాష్, నర్సింహా, మార్టిన్, మహేందర్, వెంకటేష్, సత్యనారాయణ, బాలకృష్ణ, శ్యామ్‌, రవి, నర్సింగ్, పూజ, వివేక్, ప్రసాదరావు, మురళి, టైలర్ శ్రీను, వీర శ్రీనివాస్, రమేష్, యాదగిరి, అబ్దు, ఆనంద్, కిరణ్, యుగంధర్, ప్రకాష్, అనిల్, శక్తి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png