ప్రజా సమస్యలపై టీడీపీ సమర శంఖం – ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత ! ” తెలుగుదేశం – ప్రజాపథం ” 2 వ విడత ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన " తెలుగుదేశం – ప్రజాపథం " 2వ విడత కార్యక్రమం చిక్కడపల్లి మాజీ కార్పోరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ( వాల్మీకి అంబేద్కర్ ) వాంబే హౌసింగ్ భీమా మైదానం కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్,...