Addam News
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 10:02 pm Posted by : Addam News

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ నాయ‌కుడు గ‌ణేష్ ముదిరాజ్ మృతి

 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్య‌మకారుడు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గ‌ణేష్ ముదిరాజ్ ( 54 ) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. గ‌త కొంత కాలంగా ఆయ‌న ప‌క్ష‌వాతంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ముషీరాబాద్ డివిజ‌న్‌లోని త‌న ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నాడు. ఆదివారం ఆయ‌న మృతి చెందాడు. గ‌ణేష్ ముదిరాజ్ 2008 కు ముందు బిజెపిలో ఆగిరి వెంక‌టేష్‌తో క‌లిసి ప‌ని చేశాడు. డివిజ‌న్ బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత అప్ప‌టి టిఆర్ఎస్ పార్టీలో ఆగిరి వెంక‌టేష్‌తో క‌లిసి చేరాడు. అప్ప‌టి నుంచి జ‌రిగిన తెలంగాణ ఉద్య‌మంలో గ‌ణేష్ ముదిరాజ్ కీల‌క‌పాత్ర పాత్ర పోషించాడు. తెలంగాణ మిలియ‌న్ మార్చ్‌లో సైతం గ‌ణేష్ ముదిరాజ్ పాల్గొన్నాడు. గ‌ణేష్ ముదిరాజ్ కు భార్య సుజాత‌, కూతురు రాజేశ్వ‌రి, కొడుకు మాణిక్‌రాజ్ ఉన్నారు. ఆదివారం ముషీరాబాద్ స్మ‌శాన వాటిక‌లో గ‌ణేష్ ముదిరాజ్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఉద్య‌మ‌కారులు, సీనియ‌ర్ నాయ‌కులు ఆగిరి వెంక‌టేష్‌, అజ‌య్ ముదిరాజ్‌త‌దిత‌రులు గ‌ణేష్ ముదిరాజ్ మృత‌దేహానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… గ‌ణేష్ ముదిరాజ్‌తెలంగాణ ఉద్య‌మంలో చురుకుగా పాల్గొనేవార‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png