తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ నాయ‌కుడు గ‌ణేష్ ముదిరాజ్ మృతి

  హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్య‌మకారుడు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గ‌ణేష్ ముదిరాజ్ ( 54 ) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. గ‌త కొంత కాలంగా ఆయ‌న ప‌క్ష‌వాతంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ముషీరాబాద్ డివిజ‌న్‌లోని త‌న ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నాడు. ఆదివారం ఆయ‌న మృతి చెందాడు. గ‌ణేష్ ముదిరాజ్ 2008 కు ముందు బిజెపిలో ఆగిరి వెంక‌టేష్‌తో క‌లిసి ప‌ని చేశాడు. డివిజ‌న్ బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత అప్ప‌టి టిఆర్ఎస్ పార్టీలో...