డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ –ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్ల పురోగతి పై సీఎం స‌మీక్ష‌

హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :   ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనడానికి తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలపై ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 లో భాగంగా డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ...