Addam News
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 6:51 am Posted by : Addam News

తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్‌

తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నార. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తిరుమల (Tirumala) శ్రీవారి (Tirumala temple)ని దర్శించుకున్నారు. తిరుమల (Tirumala)లో వైకుంఠద్వార దర్శనాలు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.

 

ఉదయం 6 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కొనసాగుతుంది. జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు.. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి మూడు రోజులు.. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో, శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతిస్తారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png