Addam News
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 2:11 am Posted by : Addam News

తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాల ప్ర‌దానం

తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాల ప్ర‌దానం


హైదరాబాద్, అక్టోబ‌ర్ 5, అద్దం న్యూస్ :      తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ న‌గ‌రంలో బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాలు – 2025 కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు బాబు మోహన్, ఆధ్యాత్మిక గురువు దైవజ్ఞ శర్మ, రచయిత నూరేపల్లి విజయ, మాచవరం సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వ్యవస్థాపకుడు చైర్మన్ బ్రహ్మశ్రీ డాక్ట‌ర్‌.మాచవరం గౌరీ శంకర్, మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. స్వచ్ఛంద‌ సేవా సంస్థగా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారికి పుర‌స్కారాల‌ను అంద‌చేశారు.ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… సంస్థ‌ను వివిధ రంగాలలోని వారికి ప్రోత్సహిస్తూ ఎన్నో అవార్డ్స్ జాతీయ పురస్కారాలు అందించిన గొప్ప సంస్థ‌ను స్థాపించడం, ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమ‌న్నారు. ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ ఏరియా అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నారాయణ మాట్లాడుతూ… కనీవిని ఎరుగని రీతిలో జరగటం తెలంగాణ రాష్ట్రానికి గొప్ప‌త‌న‌మ‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png