న‌గ‌ర గ్రంథాల‌యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ :      తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె.ఉపేందర్ రెడ్డి హాజ‌రై ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్‌, డాక్ట‌ర్‌.బిఆర్. అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ, సిటీ సెంట్రల్ లైబ్రరీ...