పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలను అరిక‌ట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తు – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ ( TGLSA ) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ...