కోటి దీపోత్సవ వేడుకలకు హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం మూడో రోజు అయిన సోమవారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శంఖారావం, వేదపఠనంతో ప్రారంభమైన కార్యక్రమాల్లో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. పర్ణిక బృందం భక్తిగీతాలు ఆలపించగా, సప్తస్వరాలు బృందం వీణా వాయిద్యంతో భక్తులను అలరించింది. అనంతరం చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన నిర్వహించగా, ప్రాంగణంలో భక్తులు శివలింగాలకు పుష్పార్చన చేశారు. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది....