జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం  – బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు

  అంబ‌ర్‌పేట్‌, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ :   దిల్‌షుఖ్‌న‌గ‌ర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమ‌ని బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయడం సంతోషదాయకమని తెలిపారు. బాంబు పేలుళ్ల ఘటన జరిగిన 2013 నుంచి బాధితుల బాధలు వర్ణనాతీతమన్నారు. బాంబు పేలుళ్లతో కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోగా... ఆ ఘటనలో గాయపడిన మరి కొందరు నరకయాతన...