తెలంగాణ జర్నలిస్టు సమ్మేళనం గోడ పత్రిక ఆవిష్కరణ

మిర్యాలగూడ, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నెల 13 వ తేదీన హైద‌రాబాద్‌ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జ‌రుగ‌నున్న‌ జర్నలిస్టుల ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు అంజన్న పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ బుధవారం మిర్యాలగూడ అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వారు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు....