తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అద్దం న్యూస్ : అమలు పర్చని కాంగ్రెస్ అభయ హస్తం 6 పథకాల మాదిరిగానే రాష్ట్ర బడ్జెట్ ఉందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బుధవారం కార్పొరేటర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విలేఖరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశ పెట్టిన రెండవ బడ్జెట్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆమోదకరంగా అస్సలు లేదని, మరోసారి, పేదలకు, రైతులకు, మహిళకు మొండి చెయ్యి చూపిందని అన్నారు. అమలు కానీ మహిళలకు 2500 రూపాయల...