తెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణలోనే – టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందని టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణ గడ్డ మీద న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శనగర్‌లో పార్టీని 1982 మార్చ్ 29వ తేదిన దివంగత నేత ఎన్‌టిఆర్ స్థాపించారన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అధ్యక్షతన...