గాంధీజీ ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ పయనం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్
హైదరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : " అహింసా పరమో ధర్మం " అనే పవిత్ర సూక్తిని విశ్వసించి, సత్యాగ్రహాన్నే శక్తివంతమైన ఆయుధంగా మలుచుకుని భరతమాత స్వేచ్ఛ కోసం సాగిన స్వాతంత్య్ర సమరంలో యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లెల్ల కిషోర్...