ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి – రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) : టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ ( ఆర్ అండ్ బీ ) పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నవంబర్ 6, 7 తేదీల్లో ఏఈఈ పరీక్షలు జరగనుండగా, నవంబర్ 6న ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష కూడా ఉందని తెలిపారు. ఒకే తేదీన పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని...