అరుగు చచ్చిపోయింది…!
సాయంత్రం ఐదు గంటలు. ఎండ తగ్గంగనే ఊరంతా ఒక్కొక్కలుగ అరుగుల మీదికి చేరేది. చేను నుంచి వచ్చిన రైతు భుజం మీది తువ్వాలుతో చెమట తుడుచుకుంటూ కూర్చునేది. పక్కింటి పెద్దాయన చుట్ట అంటించేది. ఆడోళ్లు ఇంకో అరుగు మీద కూరగాయలు కోసుకుంటూ ముచ్చట్లు పెట్టేది. పిల్లలు ముందు వాకిట్ల గోలీలు, బొంగరాలు. ఎవ్వలి ఇంట్ల బిడ్డకు సంబంధం కుదిరిందో, ఎవ్వలి పొలంల పురుగు పట్టిందో, ఎవ్వలి ఆవు ఈనిందో ఊరి వార్తలన్నీ ఆ అరుగు మీదనే పుట్టేటియి. అరుగు అంటే రెండు అడుగుల ఎత్తు మట్టి గద్దె...