తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బంజారా పీఠాధిపతులకు హాథిరామ్‌ బావాజీ మఠంలో పూజ‌లు చేసే అవ‌కాశం క‌ల్పించాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :   తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్‌ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం బంజారాహిల్స్‌లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు....