యూపీఐ సేవలపై చార్జీలను ఉపసంహరించుకోవాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : యూపీఐ సేవలపై చార్జీలను కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. అక్టోబర్ 15 నుండి రూ.2000 లు దాటిన లావాదేవీలు యుపిఐ సేవలపై చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్...