కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మకం
ఇది బీసీల అభివృద్ధికి పునాది అవుతుంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారు
» రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇది బీసీల అభివృద్ధికి పునాది అవుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిన్న ‘స్పష్టంగా” ఉత్తర్వులు జారీ చేయడం పట్ల 18 బిసి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శనివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బిసి భవన్‌లో 18 బిసి సంఘాలు సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షత సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం తీసుకున్న నిర్ణయం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కులగణన చేపడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంవత్సరం క్రితం ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తం చేశాయన్నారు. ఇప్పుడు చేసిన స్పష్టమైన ప్రకటనతో జాతీయ స్థాయిలో బిజెపిని దేశ ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. నీరాజనం పడుతున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుందని పేర్కొన్నారు. ఇది దేశ చరిత్రలో రికార్డు, 80 సంవత్సరాల చరిత్రలో ఈ పార్టీ కూడా కులగణన చేయలేదన్నారు. కులగణన తర్వాత బిసిలకు అన్ని రంగాలలో ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సామజిక, విద్యా, ఉద్యోగ రంగాలలో జనాభా ప్రకారం వాటా లభిస్తుందన్నారు. కులగణన తర్వాత సమాజంలో విప్లవాత్మక మైన మార్పు వస్తుందన్నారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల కులగణన డిమాండ్‌ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తరువాత నరేంద్ర మోడి ప్రభుత్వం సాహసిపోతా నిర్ణయం తీసుకుందని ప్రశసించారన్నారు.
కుల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. బిసి సబ్ ప్లాన్ వస్తుందని, బడ్జెట్ పెరుగుతుందన్నారు. అత్యంత పేద కులాలకు అన్ని రంగాలలో ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి చర్యలు తీసుకుంటారన్నారు. బీసీలకు రిజర్వేషన్లను జనాభా గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీ నియమించారని.. ఆ రిపోర్ట్ ప్రకారం గ్రూపులు చేస్తున్నారన్నారు. కులాల వారి లెక్కలు వచ్చిన తరువాత గ్రూప్‌లు విభజిస్తున్నారని… అలాగే ప్రత్యేక సంక్షేమ పధకాల రూపకల్పన, అవసరమైన బడ్జెటు కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటి వాటికి మార్గం సుస్పష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్ల స్థానాలను పెంచి కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు.
బిజెపి పార్టీ బిసి వర్గానికి చెందిన నరేంద్ర మోడీనే ప్రధాన మంత్రిగా చేసారని… అంతే కాదు 27 మంది మంత్రులను, నలుగురు గవర్నర్లను చేసారన్నారు. అలాగే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసారని… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఒక దళితున్ని చేశారన్నారు. దేశంలో యున్న ఉన్నత పదవులన్నీ బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని, గతంలో ఏ పార్టీ అయిన ఇలా ఇచ్చారా ! అని కృష్ణయ్య ప్రశ్నించారు. అలాగే జాతీయ బిసి కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారన్నారు. కేంద్రంలోని ఓబిసి కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి జిడి జారీ చేశారని తెలిపారు. వృతి కులాలను అభివృద్ధి చేయడానికి విశ్వ కర్ణ యోజన స్కీమును ప్రకటించి వృత్తి కులాలకు లక్షల నుంచి 20 లక్షల రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిల్ల సతీష్, ఓయు బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ పటేల్, శివ కుమార్ యాదవ్, అంజిగౌడ్, భీమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply