ముఖ్య‌మంత్రి మాదిగ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకోవాలి

  హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. శ‌నివారం ఎంఆర్‌పిఎస్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్‌ గజ్జల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలోహైదరాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి సుందరయ్య పార్క్ వరకు ఎమ్మార్పీఎస్ నాయ‌కులు నిరసన ప్రదర్శనను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గోవిందు...