Addam News
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 8:35 am Posted by : Addam News

కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని తెలంగాణ జానపద వృత్తి పరిరక్షణ జెఏసి నాయకులు మురళీధర్ దేశ్ పాండే ,భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం టిపిఎస్ కే హాల్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఏసి నాయకులు మురళీధర్ దేశ్ పాండే, భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..11 ఏళ్లుగా తెలంగాణ జానపద, సినిమా కళాకారుల ఏ ఒక్క సంక్షేమం కూడా నోచుకోలేదన్నారు. వీరి సమస్యలను చర్చించేందుకు తక్షణమే జానపద సినిమా కళాకారుల సంఘాలతో చర్చించి తెలంగాణ కళాకారుల ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జానపద అకాడమీ ఎర్పాటు చేయాలని అనేక సార్లు మంత్రులకు వినతి పత్రాలు సమర్పించిన స్పందించడం లేదని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని, 15 నేలల కాంగ్రెస్ పాలనలో కళాకారులకు కనీస గుర్తింపు లేదని అన్నారు. తెలంగాణలో మరోసారి ధూం ధాం కార్యక్రమం ద్వారా ఊరు వాడ చైతన్య యాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖకు నూతన ఏఎఎస్ అధికారిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం కోండూరి భాస్కర్, జానపద వృత్తి పరిరక్షణ గద్వాల కమిటీ అధ్యక్షుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు, ఘంటసాల చైతన్య వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ డప్పు స్వామి, కవి రచయిత డి.రమేష్, ఇంటలెక్చవల్ ఫొరం అద్యక్షుడు గంటి చంద్రుడు, గంగరాజు గుండె బోయిన బిసి ఉద్యమ నాయకుడు కళాకారిణి రుక్మిణీ తదితరులు పాల్గొన్నారు.

.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png