కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని తెలంగాణ జానపద వృత్తి పరిరక్షణ జెఏసి నాయకులు మురళీధర్ దేశ్ పాండే ,భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం టిపిఎస్ కే హాల్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఏసి నాయకులు మురళీధర్ దేశ్ పాండే, భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..11 ఏళ్లుగా తెలంగాణ జానపద, సినిమా కళాకారుల ఏ ఒక్క సంక్షేమం కూడా నోచుకోలేదన్నారు. వీరి సమస్యలను చర్చించేందుకు తక్షణమే జానపద సినిమా కళాకారుల సంఘాలతో చర్చించి...