ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యం – తెలుగుదేశం నగర నాయకుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముందస్తు ప్రణాళికలు, కనీస పాలనా స్పృహ లేకపోవడం వల్లే నేడు హైదరాబాద్ మహానగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి, అధిక ధరలు, కరెంట్ కోతలు తలెత్తుతున్నాయని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాబోయే వేసవి, ఎల్ నినో ప్రభావం వల్ల...