Addam News
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 9:03 pm Posted by : Addam News

బీసీల కోసం మరోసారి రాజ్యాంగాన్ని సవరించాలి – జాతీయ బీసీ మహాసభ ఆధ్యక్షుడు రాజేందర్ పేట‌ల్ గౌడ్

కాచిగూడ, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :    

భారత రాజ్యాంగాన్ని 190 సార్లు సవరరించారని, 58 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని జాతీయ బీసీ మహాసభ ఆధ్యక్షుడు రాజేందర్ పేట‌ల్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నింబోలిఅడ్డాలో ఆయన మాట్లాడుతూ… దేశంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున‌ ఎగిసిందని, బీసీల కోసం మరోసారి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది రాజ్యాంగ బద్దమైన హక్కు అని, ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం పేద విద్యార్థులకు వరంలాంటిదని, దీన్ని బలహీనపరిచే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి యేట 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.