బిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ ను తొలగించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) :     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి క్రిమిలేయర్‌ను తొలగించాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో వివిధ శాఖలకు చెందిన బీసీ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... విద్యా, ఉద్యోగ నియామకాల బిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన...