కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో బాంచన్ నీ కాల్మొక్త దొరా అనే రోజులు వ‌చ్చాయి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో బాంచన్ నీ కాల్మొక్త దొరా అనే రోజులు వ‌చ్చాయని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం చేసామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సామాజిక న్యాయం లేదు.. ఏమీ లేదు తమ పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చుకోవడానికి ఏదో ఒక...