సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పీడిత తాడిత వర్గాలకు తీరని లోటు – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, ఆగస్టు 24, అద్దం న్యూస్ : గొప్ప సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామ్యవాది, మానవతావాది, శాంతి ప్రేమికుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పీడిత తాడిత వర్గాలకు తీరని లోటన్నారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఏం ఆర్ జి వినోద్ రెడ్డి, కెవియేల్ తో కలిసి హిమాయత్ నగర్ మఖ్ధూమ్ భవన్...