Addam News
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 1:32 am Posted by : Addam News

మెట్రో ఛార్జిల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి – డివైఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి ఎండి.జావీద్‌

 

హైదరాబాద్ నగరంలో మెట్రో ఛార్జిల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

– డివైఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి ఎండి.జావీద్‌

 

హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ :   హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 నుండి మెట్రో చార్జీలు పెరుగుతున్నాయని విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డివైఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి ఎండి.జావీద్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. మెట్రో ఛార్జిలు పెంచడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకోనే వారు దూరం అయ్యో అవకాశం ఎక్కువ గా ఉంటుందన్నారు. రేట్లు పెంచడం వల్ల దూర ప్రాంతాల‌కు వెళ్లే వారు సొంత వాహనాలను ఎక్కువ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉందన్నారు. దీని వల్ల మెట్రో ఎక్కే వారి సంఖ్య తగ్గుతుందన్నారు.మెట్రో నష్టల్లోకి పోయే ప్రమాదం ఉంటుందన్నారు. కాబట్టి తక్షణమే ఛార్జిల పెంపు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png