Addam News
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 3:33 pm Posted by : Addam News

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :    బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి కార్య‌క్ర‌మం శ‌నివారం టిడిపి హైద‌రాబాద్ జిల్లా న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు హాజ‌రై జ్యోతిబా ఫులే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫులే అని అన్నారు. ఆయన సత్యశోధక్ సమాజ్ స్థాపించి దాని ద్వారా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సమాజ సేవ చేసారన్నారు. ముఖ్యంగా వితంతు పునర్వివాహాలు, మహిళలకు విద్య మొదలైన సామాజిక సంస్కరణలో పూలె కృషి అంబేద్కరును ప్రభావితం చేశాయన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా అధికారం కల్పించాలన్నదే ఫులే సంకల్పం అని.. ఆ సంకల్పం సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చేపట్టి సంక్షేమ కార్యక్రమాలు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ది పూలె ఆశయాలను ఆచరణలో పెట్టడంమేనని అన్నారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఒక గుర్తింపు తెచ్చిన ఫులేకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పరుశురామ్, శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ఎస్.ప్రకాష్, సత్తన్న, బి.రాజు, అనంద్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png